ప్రధాని మోదీ ఫస్ట్ ఫిమేల్ బాడీగార్డ్..అదాసో కపేసా ఎవరు?

ప్రధాని మోదీ ఫస్ట్ ఫిమేల్ బాడీగార్డ్..అదాసో కపేసా ఎవరు?

ఇటీవల ప్రధాని మోదీ యూకె పర్యటనలో లక్షలాది మందిని ఆకర్షించింది ఓ దృశ్యం..ఆ సీన్లో మోదీ వెనక ఓ మహిళ కనిపిస్తోంది. ఆమె ప్రధాని మోదీ పక్కన నిలబడి ఉన్న మహిళా బాడీగార్డ్. ఆమె పేరు అదాసో కపేసా.. ఇప్పుడు ఈమె గురించే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ అత్యంత కీలక బాధ్యతలో ఉండటాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ప్రశంసలు కురిపించారు. 

ఎవరీ అదాసో కపేసా.. ?

అదాసో కపేసా..ప్రధాని మోదీకి తొలి ఫిమేల్ బాడీగార్డ్. అత్యున్నత స్థాయి సెక్యూరిటీ ఫోర్స్ అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) లో ఈమె ఎలైట్ కమాండోగా పనిచేస్తున్నారు. ఈ బృందం ప్రధానమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తుంది. కఠినమైన శిక్షణ, సామర్థ్యం ఉన్నవారు మాత్రమే SPGలో భాగం కాగలుగుతారు. అదాసో కపేసా ఎంపిక భారత భద్రతా వ్యవస్థలో మహిళల పాత్రకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు. 

అదాసో కపేసా..మణిపూర్ కు చెందిన ఇన్ స్ట్రక్టర్. ప్రధాని మోదీ సెక్యూరిటీ టీంలో ఉన్న మణిపూర్ నుంచి తొలి మహిళ. అంతేకాదు.. దేశంలోనే బెస్ట్ సెక్యూరిటీ ఫోర్స్ లో మొదటి మహిళ రికార్డ్ సృష్టించింది. 

Also Read : ఎయిర్ పోర్టులో ఏది దొరికితే దానితో ఉద్యోగులను చితగొట్టిన ఆర్మీ ఆఫీసర్

అదాసో కపేసా..మొదట హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమా బల్ (SSB)లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె ఉత్తరాఖండ్ లోని పిథోర్ గడ్ లో 55వ బెటాలియన్ లో సేవలందిస్తోంది. SPGలో ఆమె చేరిక దేశంలో భద్రత ,చట్ట అమలులో మహిళలు కీలక స్థానాల్లో అందిస్తున్న సేవలను సూచిస్తుంది.