ముంబై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆర్థిక వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అన్నారు. అతడొక పరిపక్వతలేని నాయకుడని విమర్శించారు.
శనివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. పత్తి సాగు, వస్త్ర రంగానికి సంబంధించి అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించారు. "అమెరికా ప్రతి ఏటా దాదాపు 480 మిలియన్ బేళ్ల పత్తిని ఉత్పత్తి చేస్తుంది.
దీని విలువ రూ.1.25 లక్షల కోట్లు. ఇది భారతదేశ పత్తి పెంపకందారుల ప్రయోజనాలను ఏమాత్రం దెబ్బతీయదని చెప్పారు. మొత్తం అమెరికా పత్తి ఉత్పత్తి భారత పత్తి అవసరంలో 10 శాతం కూడా లేదని పేర్కొన్నారు.
