ఎయిర్ పోర్టులో ఏది దొరికితే దానితో ఉద్యోగులను చితగొట్టిన ఆర్మీ ఆఫీసర్..

ఎయిర్ పోర్టులో ఏది దొరికితే దానితో ఉద్యోగులను చితగొట్టిన ఆర్మీ ఆఫీసర్..

శ్రీనగర్ ఎయిర్ పోర్టులో జరిగిన ఎక్స్ట్రా లగేజీ గొడవ వార్తల్లోకి ఎక్కింది. దింతో ఒక సైనిక అధికారిపై కేసు బుక్కవగా అలాగే ఈ దాడిలో నలుగురు స్పైస్‌జెట్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ సైనిక అధికారి ఎయిర్‌లైన్ సిబ్బందిని కొట్టడం చూడొచ్చు. 26 జూలై  2025న శ్రీనగర్ నుండి ఢిల్లీకి వెళ్తున్న SG-386 విమానం బోర్డింగ్ గేట్ వద్ద ఓ  ప్రయాణికుడికి  పరిమితికి మించి  లగేజీ ఉంటే ఎక్స్ట్రా ఛార్జ్ ఆవుతుందని  చెప్పడంతో ఈ గొడవ మొదలైంది. వెంటనే ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ  కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బంది అక్కడికి వచ్చి గొడవను అదుపు చేసారు. 

 ఈ వీడియోలో సైనిక అధికారి తన   చేతికి దొరికిన దానితో స్పైస్‌జెట్ సిబ్బందిపై కొడుతుండగా CISF సిబ్బంది వచ్చి ఆపే దాకా కొట్టడం చూడొచ్చు. ఈ దాడిలో ఓ స్పైస్‌జెట్ ఉద్యోగి  స్పృహ తప్పి పడిపోగా, మరొక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

Also Read : కేంద్రమంత్రికి బాంబు బెదిరింపులు

స్పైస్ జెట్ స్థానిక పోలీసులకు ఈ దాడి పై కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇచ్చింది. అలాగే సైనిక అధికారిని నో-ఫ్లై లిస్టులో చేర్చింది. అలాగే  ఈ దాడి గురించి ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తెలియజేసి, అతనిపై చర్య తీసుకోవాలని కోరింది.