హైదరాబాద్- సింగపూర్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సింగాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న సింగాపూర్ ఎయిర్ లైన్స్ (518) విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ చేశారు గుర్తు తెలియని దుండగులు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు. విమానం సేఫ్‌గా ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులను కిందకు దింపి విమానాన్ని అసోసియేషన్ ప్రాంతానికి తరలించారు. విమానాన్ని తనిఖీ చేశారు సెక్యూరిటీ అధికారులు.
ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ పంపించింది ఎవరని ఆరాదీస్తున్నారు.
ఫిబ్రవరి 14న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండిగో విమానంలో బాంబ్ ఉందని బెదిరింపు రావడంతో వెంటనే శంషాబాద్ లో రన్ వేపై ఫ్లైట్ ల్యాండ్ కాగానే సిబ్బంది విమానాన్ని ఐసోలేషన్ కు తరలించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అధికారులు ఓ ప్రయాణికుడు బొమ్మను పొరపాటున విమానంలోనే మరిచిపోయినట్లుగా గుర్తించారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
