ప్రజ్వల్ రేవణ్ణకు ఖైదీ నంబర్ 15528.. జైల్లో రేవణ్ణ నెల జీతం ఎంతో తెలుసా?

ప్రజ్వల్ రేవణ్ణకు ఖైదీ నంబర్ 15528.. జైల్లో రేవణ్ణ నెల జీతం ఎంతో తెలుసా?

కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు స్టార్ గా నిలిచిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంట్లో పనిచేసే పనిమనిషిపై అత్యాచారం కేసులో డబుల్ జీవిత ఖైదు విధించిన తర్వాత అతన్ని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.శనివారం(ఆగస్టు2) రాత్రి నుంచి అతని జైలు జీవితం ప్రారంభమైంది. ప్రజ్వల్ రేవణ్ణకు ఖైదీ నంబర్15528 కేటాయించిన అధికారులు అతడిని క్రిమినల్ బ్యారక్లో ఉంచారు.

అత్యాచారంలో కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రుజువుకావడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు రేవణ్ణ జీవితం పూర్తిగా మారిపోయింది. కొత్తగా జైలు జీవితం మొదలైంది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రేవణ్ణను క్రిమినల్ బ్యారక్ లో ఉంచారు. ఖైదీ నంబర్ 15528 తో తెల్లటి యూనిఫాం ఇచ్చారు. ఇప్పుడు రేవణ్ణ జైలు దినచర్యలో భాగం కావాల్సి ఉంటుంది. ప్రతి రోజూ 8గంటల పని తప్పని సరి. ప్రారంభంలో అతడిని స్కిల్ లేని లేబర్ గా ఉంచుతారు. నెలకు రూ. 524 జీతం ఇవ్వనున్నారు. పనితీరు ఆధారంగా స్కిల్డ్ లేబర్ గా నియమించవచ్చు. 

జైలులో ప్రజ్వల్ రేవణ్ణ మొదటి రోజు.. 

జీవిత ఖైదు విధించిన తర్వాత శనివారం ప్రజ్వల్ జైలులో తొలి రోజు జైలు జీవితం గడిపాడు. జైలు వర్గాల సమాచారం ప్రకారం..అతను చాలా కలత చెంది, భావోద్వేగానికి లోనయ్యాడని తెలుస్తోంది. రేవణ్ణ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read : మా ప్రాంతంలోకి అడుగుపెడితే ఊరుకోం

ప్రజ్వలు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు లభించవని జైలు యంత్రాంగం స్పష్టం చేసింది. ఇతర ఖైదీల మాదిరిగానే అతను జైలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా రేవణ్ణను బందోబస్తు ఉన్న గదిలో ఉంచారు. 

రేవణ్ణ చేసిన నేరం ఏంటీ..?

ఏప్రిల్ 2024లో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో ఆకస్మాత్తుగా ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిలో రేవణ్ణ తన ఇంటి పనిమనిషితో అభ్యంతరకర స్థితిలో కనిపించాడు. మొదట్లో దానిని రాజకీయ కుట్రగా కొట్టిపారేశారు. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో విదేశాలకు వెళ్లాడు. 2024 ఏప్రిల్ 27న పనిమనిషి ఫిర్యాదు మేరకు రేవణ్ణపై కేసు నమోదు అయింది. 

ఈ కేసులో SIT దర్యాప్తు ప్రారంభించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాదాపు 16 నెలల తర్వాత కోర్టు ప్రజ్వల్ రేవన్నను దోషిగా నిర్ధారించి, అతనికి డబుల్ జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు అతని కొత్త గుర్తింపు ఖైదీ నంబర్ 15528గా మారింది.