అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు బలూచిస్తాన్ నాయకుడు మీర్ యార్ బలూచ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ లో భారీ చమురు, సహజ వాయువు ఫ్యాక్టరీ పెడతామంటున్నారు.. ట్రంప్ ఆ ప్రాంతంలో అడుగుపెట్టవద్దని హెచ్చరించాడు. చమురు, గ్యాస్, లిథియం ,యురేనియం వంటి వనరులు పాకిస్తాన్‌కు చెందినవి కాదు, బలూచిస్తాన్‌కు చెందినవని తేల్చి చెప్పారు.
ఇటీవల పాకిస్తాన్‌లో భారీ చమురు ,సహజ వాయువు కర్మాగారాన్ని స్థాపించాలనే తన ఆసక్తి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించగా..ఈ వ్యాఖ్యలపై స్పందించిన బలూచి తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో ట్రంప్ కు వార్నింగ్ ఇస్తూ ఓ పోస్ట్ షేర్ చేశారు.
ఆ ప్రాంతంలోని విస్తారమైన చమురు,ఖనిజ వనరులున్న మాట నిజమే.. ట్రంప్ వేసినా అంచనా కరెక్టే.. అయితే ఈ వనరుల భౌగోళిక యాజమాన్యం గురించి ట్రంప్ ప్రభుత్వం తప్పుదారి పట్టిందని మీర్ యార్ బలోచ్ సెటైరికల్ రాశారు. ట్రంప్ కు పాకిస్తాన్ తప్పుడు సమాచారం అందించింది.. ముమ్మాటికీ ఆ వనరులున్న ప్రాంతం బలూచిస్తాన్ లోనిది అని మీర్ యార్ బలూచ్ స్పష్టం చేశారు.
Also Read : ప్రధాని మోదీ ఫస్ట్ ఫిమేల్ బాడీగార్డ్
చమురు, సహజ వాయువు, రాగి, లిథియం, యురేనియం ,అరుదైన భూమి ఖనిజాల నిల్వలు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో లేవు..కానీ అవి పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన స్వతంత్ర దేశం బలోచిస్తాన్‌లో ఉన్నాయని బలూచ్ చెప్పారు. రాజకీయ ,ఆర్థిక లాభంకోసం బలూచిస్తాన్ సంపదను కొల్లగొట్టేందుకు చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం అని బలూచ్ అన్నారు.
