TCS, HCL, Cognizant కొత్త స్ట్రాటజీ.. హలో టెక్కీలు మీ జాబ్ సేఫేనా..?

TCS, HCL, Cognizant కొత్త స్ట్రాటజీ.. హలో టెక్కీలు మీ జాబ్ సేఫేనా..?

ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఆథారిత కంపెనీల్లో పనిచేస్తున్న కోట్ల మంది ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ రోజులు గడుపుతున్నారు. కేవలం 2025లోనే ఏఐ కారణంగా దాదాపు లక్షకు పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పోనీ కొత్త జాబ్ వెతుక్కుందామా అంటే పెద్దపెద్ద కంపెనీలు కూడా ఉన్నోళ్లను ఎప్పుడు ఇళ్లకు పంపిద్దామా అని చూస్తున్నాయి. దీనితో ఎంత మంచి పనితీరు కనబరిచినా జాబ్ ఉంటుందని గ్యారెంటీ అయితే లేని పరిస్థితి ప్రస్తుతం ఐటీ రంగంలో కొనసాగుతోంది. 

ఇక భారత ఐటీ సేవల రంగం, ఇక్కడి పరిస్థితులను గమనిస్తే.. ఉద్యోగుల నియామకాలను కంపెనీలు దాదాపుగా నిలిపేశాయి. ఏఐ టూల్స్ వినియోగంతో కొత్త ఉద్యోగుల అవసరం చాలా వరకు తగ్గిందని వెల్లడైంది. అయితే ఈ వార్త కోటి కలలతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న లక్షల మంది ఇంజనీర్లకు షాక్ అనే చెప్పుకోవాలి. టీసీఎస్, హెచ్సీఎల్, కాగ్నిజెంట్ కంపెనీలు ఇప్పటికే కొత్త హైరింగ్ చేసుకోకుండా బిజినెస్ వృద్ధి చేసుకుంటున్నాయి. ఇది చూస్తుంటే భారీగా రిక్రూట్మెంట్స్ భవిష్యత్తులో టెక్ రంగంలో కనిపించబోవని నిపుణులు అంటున్నారు. టాలెంట్ ఉన్నోళ్లకే జాబ్ అనే రోజులు వచ్చేస్తున్నాయి. 

అనేక దశాబ్ధాలుగా ఇండియన్ ఐటీ కంపెనీలు ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ క్లయింట్స్ ఉండటంతో ఎక్కువ ఉద్యోగులను కూడా తీసుకున్నాయి. కానీ ఏఐ ప్రపంచం దీనికి బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. వందల మంది చేసే పనిని కొన్ని ఏఐ టూల్స్ సైలెంట్ గా నిర్వహించటం అది కూడా మనుషుల కంటే ఎక్కువ ఎఫీషియెంట్ కావటంతో గేమ్ మారిపోయింది. ఏఐ ప్రస్తుతం టెక్ రంగంలో టైమ్, ఖర్చు, కాంప్లేసిటీలను భారీగా తగ్గిస్తోందని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ చెప్పారు. అందుకే కంపెనీలు కూడా ఏఐని ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. 

ALSO READ : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌

మరోపక్క దేశీయ టెక్ దిగ్గజ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ వేగంగా ఏఐ దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల సంఖ్య పెంచుకోకుండానే ఆదాయాలు 4 నుంచి 5 శాతం పెంచుకున్నట్లు సీఈవో విజయ్ కుమార్ నవంబరులో ప్రకటించారు. ఇక పెద్దన్న టీసీఎస్ దాదాపు 20వేల మందికి ఇంటికి పంపిచి ఉన్నవారిలో మరికొందరిని తగ్గించే పనిలో బిజీగా ఉంది. అయితే కాగ్నిజెంట్ 6వేల మందికి, హెచ్సీఎల్ 3వేల 489 మంది రిక్రూట్ చేసుకున్నాయి ఈ ఏడాది. మెుత్తానికి కంపెనీలు మనుషుల కౌంట్ తగ్గించుకుంటూ వేగంగా ఆదాయం పెంచుకోవటంపై ఫోకస్ పెట్టడం ఆందోళనకరంగా మారింది. ఈ ట్రెండ్ రానున్న కొన్ని నెలలు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.