న్యూఢిల్లీ: ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో తన రెండో ఆఫీస్ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకుంది. మొదటి ఆఫీస్ ముంబైలో ఉంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో క్యాపిటల్ ల్యాండ్ ఐటీపీహెచ్ బ్లాక్ ఏలో ఆఫీస్ ఓపెన్ చేయడానికి కంపెనీ ముందుకొచ్చిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
ఇది 41 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు అవుతుందని చెప్పారు. రీజినల్ కంటెంట్‌ను పెంచడం, ప్రాజెక్ట్ మానిటరింగ్, టెక్నికల్ వర్క్‌ఫ్లోలు, -పోస్ట్ ప్రొడక్షన్ కోసం వెండర్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాలు ఈ కార్యాలయంలో పనిచేస్తాయి. కాగా, బెంగళూరుకి బదులు హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ ఓపెన్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
“ఇన్ని కంపెనీలు వరుసగా హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్, రోడ్లపై గుంతల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. బెంగళూరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యల వల్ల క్వాలిటీ లైఫ్ తగ్గిందని, హైదరాబాద్ మెరుగవుతోందని మరికొంత మంది పేర్కొన్నారు.
