బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ కు చేసిందేమీ లేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ వచ్చిన 20 నెలల్లోనే తాము నాలాలు పునరుద్దరించామని..రోడ్లు వేశామని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టోలిచౌకి, బృందావన్ కాలనీ,పారామౌంట్ కాలనీ, హకీంపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వివేక్.
షేక్ పేటలో నవంబర్ 5న సీఎం రేవంత్ నిర్వహించనున్న ర్యాలీ ఏర్పాట్లను మంత్రి వివేక్ పరిశీలించారు. రేవంత్ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయ కోసం కాదు..అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ గా ఉండి జూబ్లీహిల్స్ కు రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీహిల్స్ ను రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు.
జూబ్లీహిల్స్ లో ప్రధాన పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.
