4 నెలలుగా నరకం చూస్తున్నా.. ఇంకా ట్రామాలోనే ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు

4 నెలలుగా నరకం చూస్తున్నా.. ఇంకా ట్రామాలోనే ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
  • మానసిక, శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విశ్వాస్‌‌‌‌ 

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌‌‌‌ ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా.. ఆ షాక్‌‌‌‌ నుంచి బయటకి రాలేకపోతున్నాడు. కుటుంబసభ్యులతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని, ఆ ప్రమాద ఘటన గురించే ఆలోచిస్తూ మానసికంగా, శారీరకంగా  కుంగిపోతున్నాడు.

 తాజాగా ఓ  మీడియా సంస్థకు అతడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘‘నాకు భార్య, నాలుగేండ్ల కొడుకు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి వారితో నేను సరిగ్గా మాట్లాడటం లేదు. ఒంటరిగా బెడ్‌‌‌‌పై కూర్చొని బాధపడుతున్నాను. 

నా సోదరుడు అజయ్ లేడన్న విషయాన్ని  తట్టుకోలేకపోతున్నా. నడవడానికి, మెట్లు ఎక్కడానికీ ఇబ్బంది పడుతున్నా. అజయ్‌‌‌‌ మరణం  మాకు పెద్ద షాక్‌‌‌‌. మా అమ్మ ప్రతి రోజూ గుమ్మం దగ్గర కూర్చొని సోదరుడి కోసం ఎదురుచూస్తోంది”అని ఆవేదన వ్యక్తంచేశాడు.