సాఫ్ట్వేర్ ఉద్యోగుల గుండె పగిలే ఘటన.. పాపం ఈ TCS ఉద్యోగి.. ఏంటీ దారుణం..!

సాఫ్ట్వేర్ ఉద్యోగుల గుండె పగిలే ఘటన.. పాపం ఈ TCS ఉద్యోగి.. ఏంటీ దారుణం..!

ఐటీ సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు గుడ్విల్ ఉండేది. ఉద్యోగులను బాగా చూసుకునే సంస్థగా మంచి పేరు ఉండేది. కానీ.. ఇప్పుడు ఇతర ఐటీ కంపెనీల బాటలోనే టీసీఎస్ కూడా లాభార్జనే లక్ష్యంగా ఉద్యోగ భద్రతను గాలికొదిలేస్తుందని తీవ్ర విమర్శలొస్తున్నాయి. భారతదేశ అతిపెద్ద ఐటీ కంపెనీ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌‌‌‌) గ్లోబల్‌‌‌గా  సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకోవమే ఇందుకు కారణం. అయితే.. టీసీఎస్ పరువు మరింత మంటగలిసిన విషయం పుణెలో జరిగింది. తనకు జీతం చెల్లించలేదని పుణెలోని టీసీఎస్ క్యాంపస్ ఎదుట ఒక వ్యక్తి లేఖ రాసి అక్కడే ఫుట్ పాత్పై తన ఆఫీస్ బ్యాగ్ను దిండుగా చేసుకుని నిద్రిస్తూ నిరసన తెలిపాడు. ఈ ఫొటో వైరల్ అయి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పుణెలోని టీసీఎస్ సహ్యాద్రి పార్క్ క్యాంపస్లో తనకి జులై 31న శాలరీ పడుతుందని HR చెప్పారని.. కానీ తన శాలరీ క్రెడిట్ అవలేదని ఆ లేఖలో సౌరబ్ మోరే పేర్కొన్నాడు. తన దగ్గర పుణె సిటీలో ఉండటానికి డబ్బులు లేక ఇలా ఫుట్ పాత్ మీద జులై 29 నుంచి జీతం క్రెడిట్ అవుతుందేమోనని పడిగాపులు కాస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. లేఆఫ్స్ నిర్ణయంతో టీసీఎస్ పట్ల ఇప్పటికే ఐటీ ఉద్యోగుల్లో నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. ఈ పుణె ఘటన టీసీఎస్ గుడ్ విల్ను మరింత మసకబారేలా చేసింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి మారుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది.

Also Read : ప్రజ్వల్ రేవణ్ణకు ఖైదీ నంబర్ 15528

ఈ ఏడాది తమ గ్లోబల్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌లో 2 శాతం లేదా సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తున్నామని టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏఐ వాడకాన్ని పెంచడంతో 25 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని తాజాగా ఇంటెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ కూడా సుమారు 15 వేల మందిని తీసేసింది. ఇండియాలోని టాప్ సిక్స్ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్-–జూన్ క్వార్టర్‌లో  కేవలం 3 వేల 8 వందల 47 మందిని మాత్రమే నియమించుకున్నాయి. ఇది ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో నియమించుకున్న 13 వేల 935 మందితో  పోలిస్తే  ఏకంగా 72 శాతం తక్కువ.