Chhattisgarh train accident :ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం..గూడ్స్ ను ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్ ట్రైన్

Chhattisgarh train accident :ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం..గూడ్స్  ను ఢీకొట్టిన  కోర్బా  ప్యాసింజర్ ట్రైన్

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.. మంగళవారం ( నవంబర్​4)  బిలాస్​ పూర్​ జిల్లాలోని జైరాంనగర్ స్టేషన్ సమీపంలో కోర్బా ప్యాసింజర్​ రైలు, గూడ్స్​ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. 

రెండు రైళ్లే వేగంగా ఉండటంతో కోర్బా ప్యాసింజర్ రైలు మొదటి కోచ్ గూడ్స్ రైలుపైకి ఎక్కినట్లు సంఘటన స్థలం నుండి వీడియోలు చూపిస్తున్నాయి. సమాచారం అందుకున్న​రైల్వే ,స్థానిక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ  శిశువుతో సహా అనేక మంది ప్రయాణికులను రక్షించారు. తీవ్ర గాయాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 


ప్రాథమిక సమాచారం ప్రకారం..గెవ్రా రోడ్ నుంచి బిలాస్‌పూర్‌కు ప్రయాణిస్తున్న MEMU లోకల్ రైలు (నం. 68733) మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గటోరా ,బిలాస్‌పూర్ మధ్య అప్ లైన్‌లో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోర్బా ప్యాసింజర్ రైలు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. మహిళల రిజర్వు కోచ్ నుంచి మహిళలను ఖాళీ చేయిస్తున్నారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే బిలాస్​పూర్​ జిల్లా ఎస్పీ, కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైలు సర్వీసులు నిలిపివేశారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించారు.