కొరియన్ నటుడు సాంగ్ యంగ్ క్యూ హఠాన్మరణం.. మృతిపై అనుమానాలు

కొరియన్ నటుడు సాంగ్ యంగ్ క్యూ హఠాన్మరణం.. మృతిపై అనుమానాలు

కొరియన్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సాంగ్ యంగ్ క్యూ ( 55) ( Song Young-kyu) కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకోవడం, దాని వల్ల తీవ్రమైన విమర్శలు ఎదుర్కొవడం జరిగింది. ఇప్పుడు ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమను , అభిమానులను ద్రిగ్భాంతికి గురి చేసింది.

గేంగ్గి ప్రావిన్స్ లోని యాంగిన్ పట్టణంలో ఉన్న తన టౌన్ హౌస్ సమీపంలో పార్క్ చేసిన వాహనంలో సాంగ్ యంగ్ క్యూ అపస్మారక స్థితిలో కనిపించారని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. సాంగ్ యంగ్ క్యూ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

గత నెలలో సాంగ్ యంగ్ క్యూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నారు. ఆయన బ్లడ్ లో ఆల్కాహాల్ స్ధాయి కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అంతే కాకుండా ఆయన నటిస్తున్న 'షేక్స్ పియర్ ఇన్ లవ్' అనే నాటకం నుంచి కూడా తొలగించారు.  ఈ ఘటన సాంగ్ దశాబ్దాల ఆయన కెరీర్‌కు పెద్ద మచ్చగా మారింది. 

ALSO READ : Nagarjuna : రజనీకి ఎదురుగా విలన్ పాత్ర చేయడం సవాలే.. 'కూలీ' పై నాగార్జున కామెంట్స్

ఈ వివాదంతో సాంగ్ జీవితం  ఒక్కసారిగా తల్లకిందులైంది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆయన సన్నిహితులు తెలిపారు. మీడియా, ప్రజల నుంచి వచ్చిన విమర్శలకు ఎంతో బాధపడ్డారని చెప్పారు.  సాంగ్ యంగ్ క్యూ 1994లో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఎన్నో సినిమాలు, టీవీ డ్రామాలు, నాటకాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ విషద సమయంలో ఆయన అభిమానులు, సినీ నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఆయన మరణంపై అభిమానులు పలు అనుమాలు వ్యక్తం చేస్తున్నారు.  పోలీసుల దర్యాప్తులో సాంగ్ మరణానికి అసలు కారణం తేలనుంది.