
సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) కథానాయకుడుగా, అక్కినేని నాగార్జున ( Nagarjuna ) విలన్ గా నటించిన ' కూలీ ' ( Coolie ) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగార్జున ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
తన సుదీర్ఘ నట జీవితంలో ఒక విలక్షణమైన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) , సూపర్ స్టార్ రజనీకాంత్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను నాగార్జున వివరించారు. లోకేష్ కనగరాజ్ సినిమాలకు తాను వీరాభిమాని అని, ముఖ్యంగా 'ఖైతి', 'విక్రమ్' చిత్రాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. లోకేష్ నుంచి విలన్ పాత్ర కోసం ఆఫర్ వచ్చినప్పుడు, అది తనకు ఒక కొత్త సవాలుగా, విలక్షణంగా అనిపించిందని వెల్లడించారు.
సెట్‌లో లోకేష్ పనితీరును నాగార్జున ప్రశంసించారు. ఆయనలో ఒక అద్భుతమైన ప్రశాంతత ఉంటుంది. ప్రతి షాట్ ఆయన మనసులో స్పష్టంగా ఉంటుంది, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ ముందే ఊహించుకుంటారు అని నాగార్జున పేర్కొన్నారు. ఆరు కెమెరాలతో సింగిల్ టేక్‌లో షూటింగ్ చేయడం, ఒక దర్శకుడి విజన్ ఎంత బలంగా ఉందో చెబుతుందని అన్నారు. సినిమాలో తన విలన్ పాత్ర .. ఒక నటుడిగా పూర్తి సృంతృప్తిని , స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు.
ALSO READ : నెట్‌ఫ్లిక్స్‌లో 'సారే జహాన్ సే అచ్చా'.. అణు యుద్ధం నేపథ్యంలో స్పై థ్రిల్లర్!
రజనీకాంత్‌తో తన అనుబంధాన్ని నాగార్జున వివరించారు. వైజాగ్‌లో షూటింగ్ సమయంలో రజనీకాంత్ తన కారవాన్‌లోకి స్వయంగా వచ్చి, తనను ఆహ్వానించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. రజనీ సార్ తొలుత నన్ను చూసి నీవు ఇంకా ఇంత యంగ్ గా కన్పిస్తున్నావు. ఈ రహస్యం ఏమిటి అని అడిగారని .. ఈ సినిమాలో మీ పాత్ర ఇంత పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిసి ఉంటే, లోకేష్‌కు మిమ్మల్ని తీసుకోవద్దని చెప్పేవాడిని అని సరదాగా అన్నారు అని నాగార్జున చెప్పారు.
ఈ చిత్రంలో నటించిన సత్యరాజ్, శ్రుతి హాసన్, అనిరుధ్ రవిచందర్ వంటి సాంకేతిక నిపుణులను కూడా నాగార్జున ప్రశంసించారు. 'కూలీ' సినిమా కేవలం ఒక చిత్రం కాదని, కళాత్మక సృజనాత్మకత, అద్భుతమైన నటీనటుల సమూహం కలయిక అని నాగార్జున కొనియాడారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
సన్ పిక్చర్స్ పతాకంపై ఈ'కూలీ' చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ దేవాగా, సైమన్ గా నాగార్జున, రాజశేఖర్ గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్ గా సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు. అమీర్ ఖాన్ దహా పాత్రలో మెప్పించనున్నారు. ఆగస్టు 14 వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో అత్రుతలో ఎదురుచూస్తున్నారు.