
దేశభక్తిని చాటిచెప్పే స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సారే జహాన్ సే అచ్చా ' ( Saare Jahan Se Accha ). అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 13న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సిరీస్ విడుదల కానుంది. ఇందులో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ఏజెంట్ విష్ణు శంకర్ కథను చూపించనున్నారు. ప్రపంచాన్ని అణు యుద్ధం నుండి కాపాడే ఒక భారతీయ గూఢచారి కథతో నెట్‌ఫ్లిక్స్ ( Netflix )లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ట్రైలర్ రిలీజ్ చేసింది.
స్పై థ్రిల్లర్ కథాంశం..
1970ల నాటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఒక చిన్న పొరపాటు అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్న సమయంలో ఈ స్పై థ్రిల్లర్ కథ సాగుతుంది. ఈ సిరీస్ లో భారత రా ఏజెంట్ విష్ణు పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ ముర్తాజా మాలిక్ ను ఓడించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో సమయం తక్కువగా ఉండటంతో, ప్రపంచాన్ని నాశనం చేయగల రహస్య అణు ప్రణాళికను ఆపడానికి విష్ణు శత్రు భూభాగంలోకి వెళ్తాడు. ఇతను పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ప్రమాదకరమైన మిషన్ ను ఎలా పూర్తి చేశాడు? అందులో విజయం సాధించాడా? అన్నదే ఈ కథాంశం.
వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ప్రధాన పాత్ర పోషించిన ప్రతీక్ గాంధీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర దారి విష్ణు ప్రపంచంలో పొరపాట్లకు తావు లేదు. ప్రతి కదలిక లెక్కించి వేయాల్సిందే, ప్రతి భావోద్వేగాన్ని అణచిపెట్టాల్సిందే. ఈ పాత్రలో నిశ్చలత్వం వెనుక ఉన్న తీవ్రత, అదృశ్యంగా ఉంటూనే దేశం కోసం పోరాడటంలోని భావోద్వేగ సంఘర్షణ ఆకట్టుకున్నాయని తెలిపారు. ప్రేక్షకులు ఈ ట్రైలర్‌తో ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
విష్ణు శత్రువు ముర్తాజా మాలిక్ పాత్రను పోషిస్తున్న సన్నీ హిందుజా మాట్లాడుతూ.. నా పాత్ర ముర్తాజా చాలా క్రమశిక్షణ, ప్రమాదకరమైన వాడిదిగా ఉంటుంది. విష్ణు మాదిరిగానే అతని ఏకైక లక్ష్యం తన దేశానికి సేవ చేయడం. మా పోరాటం కేవలం బలం గురించి కాదు, ఎవరు ఒక అడుగు ముందుంటారనే దాని గురించి. ఇది వ్యక్తిగతంగా, వ్యూహాత్మకంగా సాగుతుంది అని తెలిపారు.
"సారే జహాన్ సే అచ్చా' భారతదేశ చరిత్రలో 1970ల నాటి అత్యంత ముఖ్యమైన దశాబ్దానికి సంబంధించిన గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్ తాన్య బామి అన్నారు. ఈ సిరీస్ లో ప్రతీక్ గాంధీ, సన్నీ హిందుజా, తిలోత్తమా షోమ్, కృతికా కమ్రా, రజత్ కపూర్, సుహైల్ నయ్యర్, అనూప్ సోని వంటి అద్భుతమైన నటీనటులు నటించారు. దర్శకుడు గౌరవ్ శుక్లా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ భవేశ్ మందాలియా, నిర్మాత సెజల్ షా ఈ కథను రూపొందించడానికి ఎంతో కృషి చేశారు. 'పఠాన్', 'వార్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఆరిఫ్ షేక్ ఈ సిరీస్‌కు పదునైన, సినిమాటిక్ టచ్ ఇచ్చారు. ఇది దేశభక్తి, గూఢచర్యం గురించి మనసుకు హత్తుకునే కథ. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ శక్తివంతమైన కథను ప్రేక్షకులు అనుభవించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని అన్నారు.