IND vs ENG 2025: ఇంగ్లాండ్ కిందకి.. ఇండియా పైకి: WTC లేటెస్ట్ పాయింట్స్ టేబుల్‌ ఇదే!

IND vs ENG 2025: ఇంగ్లాండ్ కిందకి.. ఇండియా పైకి: WTC లేటెస్ట్ పాయింట్స్ టేబుల్‌ ఇదే!

ఇంగ్లాండ్ తో ఓవల్ టెస్టులో విజయంతో టీమిండియా ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీని 2-2 తో సమం చేసింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఓవల్ టెస్ట్ లో 6 పరుగుల తేడాతో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి రోజు విజయానికి నాలుగు వికెట్లు అవసరం కాగా.. సిరాజ్ అద్భుత బౌలింగ్ తో టీమిండియా గెలిచింది. తొలి టెస్టు.. మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా..  రెండో  టెస్ట్, ఐదో టెస్టులో భారత్ గెలిచింది. నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగియడంతో ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 

ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను సమం చేసిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఐదు మ్యాచ్‌లలో రెండు విజయాలతో 28 పాయింట్లతో 46.66 శాతాన్ని సాధించింది. మరోవైపు ఇంగ్లాండ్ 26 పాయింట్లతో 43.33 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇండియాతో లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ కు 2025-27 స్టాండింగ్స్‌లో రెండు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రూల్స్ లో భాగంగా ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక జట్టుకు ప్రతి తక్కువ ఓవర్‌కు ఒక పాయింట్ జరిమానా విధించబడుతుంది. ఇంగ్లాండ్ రెండు ఓవర్లు ఆలస్యం వేసిన కారణంగా రెండు పాయింట్లలో కొత్త విధించారు. 

వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా గత నెలలో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో విజయం సాధించిన తర్వాత అగ్రస్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక (66.66) రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఇంకా ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. భారత్ తమ తర్వాత టెస్ట్ మ్యాచ్ ను అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్ పై ఆడనుంది.