ఇరాన్ సుప్రీం లీడర్ర ఖమేనీ మృతితో ఆయన మద్ధతు దారులు పాకిస్తాన్ లో ఆందోళనలకు దిగారు. ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా నిర్వహించిన ఆపరేషన్ లో ఖమేనీ చనిపోవడంతో.. అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం (మార్చి 01) కారాచిలోని అమెరికా కాన్సులేట్ ముందు ఖమేనీ మద్ధతు దారులు వీరంగం సృష్టించారు. రాయబార కార్యాలయానికి నిప్పు పెట్టి.. ధ్వంసం చేశారు.
దీంతో అమెరికా మెరైన్ సెక్యూరిటీ బలగాలు ఓపెన్ ఫైర్ ప్రారంభించి కాల్చిపారేశాయి. నిరసనలు హింసాకృతిని దాల్చటంతో భద్రతా దళాలు కాల్పులు జరపటంతో.. 12 మంది ఖమేనీ మద్ధతు దారులు మృతి చెందారు.
ఉదయం కరాచీలోని యూఎస్ కాన్సులేట్ లో.. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. షియా గ్రూప్ నిరసనకారులు గుంపులుగా చేరి.. సుల్తానా బాద్ నుంచి మై కొలాచి వైపుగా ర్యాలీ తీశారు. వాషింగ్టన్, తెల్ అవీవ్ నశించాలి అంటూ స్లోగన్స్ చేస్తూ దూసుకుపోయారు.
►ALSO READ | ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో CBSE పరీక్షలు వాయిదా
నిరసనకారుల సంఖ్య పెద్ద ఎత్తున చేరుకుని నిషేధిత ప్రాంతాల వైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. బారికేడ్లను తొలగిస్తూ.. రాళ్లు రువ్వుతుండటంతో పోలీసులు టియర్ గ్యాస్ విడుదల చేశారు. ఆ తర్వాత డిప్లొమాటిక్ జోన్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో మెరైన్ సెక్యూరిటీ హై అలర్ట్ ప్రకటించింది.
సెక్యూరిటీ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి.. కాన్సులేట్ ను ధ్వంసం చేస్తున్న క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు పాకిస్తాన్ సమా టీవీ పేర్కొంది. టీవీ ప్రకారం 8 మందికి పైగా చనిపోగా, 30 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు వెల్లడించింది. స్థానిక అధికారులు 12 వరకు చనిపోయినట్లు తెలిపారు.
