
ఆదివారం ( ఆగస్టు 3 ) శ్రీశైలం - హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో డ్యామ్ సుందర దృశ్యాలను చూసేందుకు యాత్రికులు ఘాట్ రోడ్డులో వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు పది కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఏపీ పరిధిలోని లింగాల గట్టు నుండి బ్రహ్మగిరి ( దోమల పెంట ) వరకు పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పర్యాటకులు, భక్తులు రోడ్లపై తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు సైతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడం పైగా శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో యాత్రికులు పెద్దఎత్తున శ్రీశైలంకు చేరుకుంటున్నారు. యాత్రికుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని.. ట్రాఫిక్ జామ్ సమస్య పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు భక్తులు.