6వ తరగతి ఫెయిల్ ఒక కూలీ కొడుకు ఇడ్లీ, దోశ పిండితో 100 కోట్ల కంపెనీ: సక్సెస్ నే సాధించాడు..

  6వ తరగతి ఫెయిల్ ఒక కూలీ కొడుకు ఇడ్లీ, దోశ పిండితో 100 కోట్ల కంపెనీ: సక్సెస్ నే సాధించాడు..

జీవితంలో సక్సెస్ అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు. అలాగే ప్రతిరోజు మీరు కోరుకున్నట్లు ఉండదు, కానీ ఎదో ఒక రోజు మీ జీవితాన్నే మార్చే టైం వస్తుంది. అందుకు ముస్తఫా జీవితమే ఒక ఉదాహరణ. 43 ఏళ్ల ముస్తఫా కేరళలోని వయనాడ్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి ఒక కూలీ. తల్లి స్కూలుకి  వెళ్ళలేదు. అయితే ముస్తఫా 6వ తరగతి ఫెయిల్, కానీ చివరికి కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,  బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చదువు పూర్తి చేసాడు. నేడు ముస్తఫా 100 కోట్ల విలువైన కంపెనీకి రారాజు. ఐడి ఫ్రెష్-ప్యాకేజ్డ్ ఇడ్లీ అండ్ దోస పిండి ఇప్పుడు అన్ని ప్రముఖ నగరాల్లో అమ్ముడవుతోంది. ముస్తఫా కేవలం రూ. 25 వేలతో ఈ కంపెనీని ప్రారంభించి ఇప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

వయనాడ్‌లోని ఒక చిన్న గ్రామంలో పెరిగిన ముస్తఫా, ఆ గ్రామం చాలా మారుమూలల్లో ఉండటంతో మాకు ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండేది. దానికి రోడ్లు లేదా విద్యుత్ లేదు. హై స్కూల్  వెళ్లడానికి కనీసం నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది, కాబట్టి చాలా మంది పిల్లలు ప్రైమరీ  స్కూల్ తర్వాత చదువు మానేశారు. ముస్తఫా  తండ్రి అహ్మద్ 4వ తరగతి తర్వాత చదువు మానేసి కాఫీ తోటలో కూలీగా పనిచేశారు. తల్లి ఫాతిమా అసలు స్కూలు వెళ్లలేదు. ముస్తఫా మొదటి వాడు, అతనికి ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. 

అయితే ముస్తఫాకు ఎప్పడు కూడా ఓ కంపెనీ స్థాపించాలని, ఓనర్  కావాలని కోరిక లేదు. కానీ ఇంజనీర్ కావాలని అనుకున్నాడు. ముస్తఫాచిన్నతనంలో బంధువులలో ఒకరు షంషుద్దీన్ దగ్గరలోని షాపులో రబ్బరు బ్యాండ్‌తో కట్టిన ప్లాస్టిక్ సంచులలో దోస పిండి అమ్ముతున్నట్లు చూసి, దోస పిండిని తయారు చేసి సప్లయ్ చేయమని చెప్పాడు. అ క్షణమే అతని జీవితాన్ని మార్చేసింది. ముస్తఫా రూ. 25వేల పెట్టుబడి పెట్టి వెంటనే ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనీ అనుకున్నాడు. 

దింతో నాసర్, షంషుద్దీన్, జాఫర్, నౌషాద్, ముస్తఫా చేతులు కలిపారు. దాదాపు 550 చదరపు అడుగుల చిన్న స్థలంలో రెండు గ్రైండర్లు, మిక్సర్ ఇంకా సీలింగ్ మెషిన్‌తో  పని ప్రారంభించారు. కంపెనీ పేరు కోసం మాట్లాడుతుండగా ఒక బంధువు ఇడ్లీ దోస కోసం ఐడిని పెట్టమన్నాడు.  ఫ్రెష్ దోస, ఇడ్లీ పిండి సప్లయ్ చేయాలని ప్లాన్ చేసారు కాబట్టి వెంటనే ఐడి ఫ్రెష్ అని పేరు పెట్టారు.

ALSO READ | దేశంలోని 60% ఆస్తులు ఆ ఒక్క శాతం మంది దగ్గరే.. వీళ్లంతా పెట్టుబడి పెట్టేది ఎందులోనో తెలుసా..?

2015 అక్టోబర్‌లో ఐడి ఫ్రెష్ రూ.100 కోట్ల కంపెనీగా మారాక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 2005లో రోజుకు 10 ప్యాకెట్ల ఉత్పత్తితో కేవలం బంధువులే వంటగది చూసుకునేవారు కానీ 10 సంవత్సరాలలో 1,100 మంది ఉద్యోగులతో రోజుకు 50 వేల ప్యాకెట్లకి పైగానే  ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు. 

నేడు ఐడి ఫ్రెష్ ఉత్పత్తులు మంగళూరు, బెంగళూరు, ముంబై, మైసూర్, పూణే, చెన్నై, హైదరాబాద్ సహా భారతదేశంలోని ఏడు నగరాల్లో 20 వేల కంటే ఎక్కువ స్టోర్లలో అమ్ముడవుతున్నాయి. ఐడి ఫ్రెష్ ఫుడ్ అనేది రాగి ఇడ్లీ/దోస పిండి, మలబార్ పరోటా, బియ్యం పిండి, హోల్ వీట్ & ఓట్స్ దోస వంటి చాల రుచులను అందించే ప్రముఖ ఆహార సంస్థలలో ఒకటి. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 100 కోట్లకు పైమాటే. ఐడి ఫ్రెష్ ఉత్పత్తులలో కొత్తిమీర చట్నీ, టమోటా చట్నీ, పరాట, చపాతీ  సహా ఇంకా చాల రకాల వెరైటీలు కూడా ఉన్నాయి.