దేశంలోని 60% ఆస్తులు ఆ ఒక్క శాతం మంది దగ్గరే.. వీళ్లంతా పెట్టుబడి పెట్టేది ఎందులోనో తెలుసా..?

దేశంలోని 60% ఆస్తులు ఆ ఒక్క శాతం మంది దగ్గరే.. వీళ్లంతా పెట్టుబడి పెట్టేది ఎందులోనో తెలుసా..?

Indian Rich: ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుల్లో ఎన్ని మార్పులు వచ్చినా భారతీయ సంపన్నుల ప్లానింగ్ కొంత భిన్నంగానే కొనసాగుతుంది. నేటి కాలంలో ఫ్యామిలీ ఆఫీసులు, వెల్త్ మేనేజర్లు రాకతో పెట్టుబడుల తీరుతెన్నులు స్వల్పంగా మారాయి. ఈ క్రమంలోనే అసలు భారతదేశంలోని సంపన్నులు డబ్బులు ఎలా, ఎక్కడ, ఎంత మేర దాస్తున్నారనే బెర్న్‌స్టెయిన్ రిపోర్ట్ ఇప్పుడు అందరినీ అశ్చర్యానికి గురిచేస్తోంది. 

దేశంలోని 60 శాతం సంపన్నులు తమ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారంలోనే దాచుకుంటున్నట్లు తాజా బెర్న్‌స్టెయిన్  రిపోర్ట్ వెల్లడించింది. అలాగే టాప్ సంపన్నులను ఉబెర్ రిచ్ అనే కొత్త గ్రూప్ కిందకు చేర్చింది బెర్న్‌స్టెయిన్. వీరిలో దేశంలో అధికంగా ఆదాయం పొందుతున్న 1 శాతం మంది ఉన్నారు. ఈ ఒక్కశాతం మంది చేతిలోనే దేశంలోని 60 శాతం ఆస్తులు ఉన్నట్లు నివేదించింది. అలాగే ఆర్థిక పెట్టుబడుల్లో 70 శాతం కూడా ఈ టాప్ 1 శాతం మందే హోల్డ్ చేస్తున్నట్లు తేలింది. 

ALSO READ : ఇదే పచ్చి నిజం.. 5 ఏళ్లలో AI 80 శాతం ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందన్న ఇన్వెస్టర్!

భారతదేశంలో ప్రజల మెుత్తం ఆస్థి విలువ 19.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 59 శాతం అంటే 11.6 ట్రిలియన్ డాలర్ల సంపద పైన చెప్పుకున్న 1 శాతం ఉబెర్ రిచ్ వద్దే ఉందని గుర్తించబడింది. వీరు దాదాపు 30 శాతం సంపదను మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు, ఇన్సూరెన్స్, బ్యాంక్ గవర్నమెంట్ డిపాజిట్లు, యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్లలో ఉంచుతున్నట్లు వెల్లడైంది. ఇక మిగిలిన 70 శాతం సంపదను బంగారం, రియల్ ఎస్టేట్, క్యాష్ వంటి భౌతిక ఆస్తులకు కేటాయించారు. 

ఇలాంటి సమయంలోనే వెల్త్ మేనేజర్లకు సంపన్న పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, వెల్త్ మేనేజర్లకు ఇదొక మంది వ్యాపార అవకాశంగా కూడా మారింది. ప్రస్తుతం సంపన్నులు తమ డబ్బును వివిధ మార్గాల్లోకి డైవర్సిఫై చేయాలని, సాంప్రదాయ పెట్టుబడుల నుంచి బయటపడాలని చూస్తుండటం అడ్వైజర్లకు కలిసొస్తోంది. దేశంలో ఆదాయ వ్యత్యాసాలతో పాటు సంపద విషయంలోనూ ప్రజల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు బెర్న్‌స్టెయిన్ గుర్తించింది. దేశంలోని ఫైనాన్సియల్ ఆస్తుల్లో 70 శాతం అంటే 4.5 ట్రిలియన్ డాలర్లను ఉబెర్ రిచ్ కేటగిరీ చేతిలోనే ఉందని రిపోర్ట్ చెబుతోంది.