న్యూఢిల్లీ: అదానీ పవర్ సంస్థ అదానీ అటామిక్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో సబ్సిడరీని ప్రారంభించింది. అణు శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి పంపిణీ లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న ఈ సంస్థ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి గుర్తింపు పొందింది. అదానీ పవర్‌కు ఇందులో వంద శాతం వాటా ఉంటుంది. రూ.ఐదు లక్షల ప్రైమరీ క్యాపిటల్‌తో ఈ సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టింది. అణు ఇంధన రంగంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది.
