ఉద్యోగులను తొలగించం.. నైపుణ్యాలను పెంచుతాం..ఎన్టీటీ బిజినెస్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్

ఉద్యోగులను తొలగించం.. నైపుణ్యాలను పెంచుతాం..ఎన్టీటీ బిజినెస్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్

హైదరాబాద్​, వెలుగు:  ఏఐ కారణంగా ఉద్యోగులను తొలగించబోమని ఎన్టీటీ డేటా  బిజినెస్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్ నోర్బర్ట్​ రోటర్ ​అన్నారు. నైపుణ్యాలపై వారికి శిక్షణ ఇస్తామని ప్రకటించారు. తమ సంస్థ ‘ఎస్ఏపీ’ సేవల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రీసెల్లర్ అని వెల్లడించారు. 

 హైదరాబాద్​లో గురువారం నిర్వహించిన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మేషన్  నౌ 2026 ఇండియా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇండియాలోని మా ఎనిమిది ఆఫీసుల్లో 4,300 మంది పనిచేస్తున్నారు. 

విశాఖపట్నంలో 250 సీట్ల సామర్థ్యంతో కొత్త కేంద్రాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తాం. ఆదిలాబాద్‌లోని మోడల్ సెంటర్ 150 మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల డిజిటలైజేషన్ మా ప్రధాన లక్ష్యం.  బీ2బీ​ పేమెంట్లను సులువుగా చేయడానికి ఎన్​సీపీఐ భారత్​తో ఒప్పందం చేసుకున్నాం’’ అని ఆయన వివరించారు.