తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్... హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు...

తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్... హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు...

గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతిసవాళ్ళతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ విసిరిన సవాల్ పై చర్చించేందుకు మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ లు గన్ పార్క్ దగ్గర బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు మంత్రి జూపల్లి సవాల్ పై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. తెలంగాణ భవన్ దగ్గర నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హరీష్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ క్రమంలో తెలంగాణ భవన్ కు వెళ్తున్న కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు. పోలీసులకు హరీష్ రావు మధ్య వాగ్వాదం నెలకొన్న సమయంలో తొక్కిసలాట జరగడంతో కిందపడిపోయారు హరీష్ రావు. తమ నేతను అడ్డుకోవడంపై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు. గన్ పార్క్ దగ్గర తాము సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. మంత్రుల సవాల్ స్వీకరించిన హరీష్ రావు... తామే గన్ పార్క్ దగ్గరికి వస్తామని అన్నారు.

తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని... చర్చ నుంచి పారిపోవద్దని మంత్రులకు సవాల్ విసిరారు హరీష్ రావు.అయితే అనుమతి లేకపోవడంతో హరీష్ రావును గన్‌పార్క్‌కు వెళ్లనీయకుండా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.