ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం సీఎం రేవంత్ కు లేదు: కేటీఆర్

ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం సీఎం రేవంత్ కు లేదు: కేటీఆర్

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ళతో తెలంగాణ దద్దరిల్లుతోంది. ఇరువర్గాలు చర్చకు సిద్దమవ్వడంతో గన్ పార్క్, తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్ నుండి గన్ పార్క్ బయలుదేరిన హరీష్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ప్రతిపక్షాలను ఎదుర్కునే ధైర్యం సీఎం రేవంత్ కు లేదని అన్నారు. 

గతంలో కూడా రేవంత్ ఈ రకంగానే సవాల్ చేశారని..తాము చర్చకు వెళ్తే రాకుండా ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు కేటీఆర్.సీఎం రేవంత్ మళ్ళీ ఇప్పుడు అప్పులపై చర్చకు రావాలని సవాల్ విసిరారని..సీఎం సవాల్ స్వీకరించి ఎక్కడికి రావాలో చెప్తామన్నామని.. మధ్యలో జూపల్లి సవాల్ స్వీకరించి తెలంగాణ భవన్ కు వస్తానని అన్నారు... దీంతో 10 గంటలకే తెలంగాణ భవన్ కు వచ్చామని అన్నారు.

గురుకుల టెండర్ల స్కాంపై మంత్రులకు హరీష్ రావు సవాల్ చేశారని...ఆయన గన్ పార్క్ దగ్గరికి బయలుదేరిన వెంటనే అరెస్ట్ చేశారని అన్నారు. ప్రభుత్వానికి ఇంత భయమెందుకు... కనీసం అసెంబ్లీలోనైనా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్.