ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీకి ఎంట్రీ!..3శాతం పడిపోయిన జొమాటో, స్విగ్గీ షేర్లు

ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీకి ఎంట్రీ!..3శాతం పడిపోయిన జొమాటో, స్విగ్గీ షేర్లు

న్యూఢిల్లీ: ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌ ఫుడ్ డెలివరీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మే–జూన్ మధ్య బెంగళూరులో  పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసి, 2026 చివరికి లేదా 2027 ప్రారంభంలో పూర్తి స్థాయి సేవలను అందించాలని ఆలోచిస్తోందని ఎకనమిక్​ టైమ్స్​ రిపోర్ట్ చేసింది.   సొంత ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ద్వారా  లేదా ఓఎన్‌‌‌‌‌‌‌‌డీసీ  ద్వారా పనిచేయాలా అనే విషయంలో తుది నిర్ణయానికి రాలేదు. 

ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌తో జొమాటో, స్విగ్గీ షేర్లు గురువారం   3శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుతం 9 బిలియన్ డాలర్ల విలువైన ఫుడ్ డెలివరీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది.  ఎటర్నల్‌‌‌‌‌‌‌‌ (జొమాటో) షేర్ 1.6శాతం తగ్గి రూ.295.9 వద్ద, స్విగ్గీ షేర్ 3శాతం తగ్గి రూ.331.75 వద్ద ట్రేడ్ అయ్యాయి.   ఇటీవల  బైక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్సీ రాపిడో కూడా ఫుడ్ డెలివరీలోకి ఎంటర్ అయింది.