
AI Effect: ఏఐతో ఉద్యోగాలు పోతాయి లేదా కొత్తవి వస్తాయి అనే అంశాల మధ్య గందరగోళం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే దీనిపై సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్ కాస్టులో స్పందించారు. సిలికాన్ వ్యాలీలో ప్రముఖ పెట్టుబడిదారుగా గుర్తింపు ఉన్న ఆయన ఏఐతో భవిష్యత్తు ఎలా ఉండనుందనే అంశాలను పంచుకున్నారు.
ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు లేదా వివిధ ఉపాధి అవకాశాల్లో దాదాపు 80 శాతం.. ఏఐ కారణంగా రానున్న 5 ఏళ్లలో కనుమరుగవుతాయని చెప్పారు. ఇది ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగ అవాకాశాలను కనుమరుగు చేస్తుందని చెప్పారు వినోద్. ఏఐతో ఆటోమేషన్ దీనికి అసలు కారణంగా ఆయన చెప్పారు. ప్రతి పరిశ్రమలో లా నుంచి మెడికల్ వరకు ఎక్కువ పనులు ఏఐతోనే జరగనున్నాయని వెల్లడించారు.
ఈ కారణంగా నేటి కాలం యువత భవిష్యత్తు మార్పులకు అనుగుణంగా తమ కెరీర్ ప్లానింగ్ చేసుకోవటం చాలా ముఖ్యమని హెచ్చరించారు. యంత్రాలు మనుషుల సామర్థ్యాలను దాటే రోజులు రాబోతున్న క్రమంలో దానిని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగటంపై ఫోకస్ చేయాలని సూచించారు. ఏఐ యుగంలో క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, వివిధ అంశాలను ఒక్కటిగా చేర్చి పరిశీలించటం వంటి స్కిల్స్ చాలా ముఖ్యమన్నారు.
►ALSO READ | అనిల్ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు.. రిలయన్స్ రుణాలపై బ్యాంకులకు ఈడీ లేఖలు!
రానున్న 25 ఏళ్లలో ఏఐ కారణంగా ప్రపంచ స్థాయి విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందనున్నట్లు వినోద్ అభిప్రాయపడ్డారు. ఒకపక్కఉద్యోగాలు పోతుంటే మరోపక్క ఖరీదైన వైద్యం, విద్య అందుబాటులోకి వస్తాయని.. ఏఐ నైపుణ్యం కలిగిన ఉత్తమ డాక్టర్, ఉత్తమ టీచర్లు, యూనివర్సిటీలను రీప్లేస్ చేయగలదని అభిప్రాయపడ్డారు. అలాగే ఉపాధి అవకాశాల కోసం మహా నగరాలకు, మెట్రోలకు వెళ్లే రోజులు కూడా త్వరలోనే కనుమరుగవుతాయని చెప్పారు. చిన్న నగరాల నుంచి కూడా రిమోట్ విధానంలో జాబ్ ఈజీ అవుతుందన్నారు. ఏఐ ఒక అద్భుతమైన సాధనం అని అయితే దానిని మనం ఎలా ఉపయోగించుకుంటామే విషయం పూర్తిగా మానవుల చేతిలోనే ఉందన్నారు వినోద్.