హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఇన్నోవేషన్లను ప్రోత్సహించడానికి డ్రేపర్ స్టార్టప్ హౌస్ డ్రేపర్ స్టార్టప్ హబ్‌గా మారింది. సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారు టిమ్ డ్రేపర్ నేతృత్వంలోని గ్లోబల్ నెట్‌వర్క్ దీనికి మద్దతు ఇస్తోంది. ఈ హబ్ ప్రారంభదశలో 20 స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
ఒక్కో స్టార్టప్‌కు రూ.50 లక్షలు నుంచి రూ.50 కోట్ల వరకు నిధులు కేటాయిస్తారు. కో– వర్కింగ్ స్పేస్ నుంచి ఇది ఇప్పుడు పెట్టుబడులు పెట్టే అక్రిలరేటర్‌గా మారింది. వచ్చే నెల డ్రేపర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు.
