వాషింగ్టన్: టెహ్రాన్‌లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్( ఐఆర్జీసీ) హెడ్‌క్వార్టర్స్‌ను అమెరికా సైన్యం మిసైల్స్ దాడులతో పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడిని ‘పాము తలను కట్‌చేయడం’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) పేర్కొంది. ఇప్పుడు ఐఆర్‌జీసీకి హెడ్‌క్వార్టర్స్ లేదని, ఈ దాడిలోనే ఐఆర్జీసీ కమాండర్ మహమ్మద్ పక్‌పూర్ మరణించాడని ప్రకటించింది. గత 47 ఏండ్లలో ఐఆర్జీసీ వెయ్యి మందికిపైగా అమెరికన్ల ప్రాణాలు బలిగొన్నదని ఆరోపించింది.
అమెరికా–ఇజ్రాయెల్ కలిసి శనివారం నుంచి చేస్తున్న ఈ దాడుల్లో ఇరాన్‌లోని వెయ్యికి పైగా టార్గెట్లపై బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో ఐఆర్జీసీ జాయింట్ హెడ్‌క్వార్టర్స్, కమాండ్ సెంటర్లు, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు, నౌకలు, సబ్‌మెరైన్లు ఉన్నాయి. అమెరికా ఫ్రిగేట్ల నుంచి క్షిపణులు ప్రయోగించి ఐఆర్జీసీ భవనాలు, ఇరాన్ యుద్ధ విమానాలను పేల్చివేశారు. తొమ్మిది ఇరాన్ నౌకలను ధ్వంసం చేశామని అమెరికా ప్రెసిడెంట్డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
