హైదరాబాద్, వెలుగు: యువత కోసం మార్వాడీ యూనివర్సిటీ రాజ్‌కోట్‌లో యూత్ అండ్ డెమోక్రసీ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ‘బ్రిడ్జింగ్ పార్టిసిపేషన్ అండ్ పవర్’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో ప్రముఖులు పాల్గొన్నారు. రాజకీయాల్లో యువత పాత్రపై పర్షోత్తమ్ రూపాలా, దేవయాని రాణా తన అనుభవాలను వివరించారు.
యంగ్ ఇన్నోవేటర్స్ ఎక్స్‌పో 2026 కూడా నిర్వహించారు. ఇందులో 140 కి పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రోత్సాహంపై చర్చించారు.
