పోక్సో కేసులో ఎట్టకేలకు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు లొంగిపోయాడు. అతని కుటుంబ సభ్యులు లాయర్ల సమక్షంలో మే 16న బండి భగీరథ్ ను పోలీసులకు అప్పగించారు. బాలికను లైంగికంగా వేధించారనే కేసులో బండి భగీరథ్ నిందితుడు.మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది.
మరో వైపు ఈ కేసులో ఇవాళ మరోసారి మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాలు రెండుసార్లు నమోదు చేసిన పోలీసులు .. మెజిస్ట్రేట్ ఎదుట 40 నిమిషాల పాటు బాధితురాలు ఆమె తల్లి వాంగ్మూలాలు నమోదు చేశారు.
లుకౌట్ నోటీసులు
పోక్సో కేసులో బండి భగీరథ్కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ హైదరాబాద్ నుంచి పారిపోకుండా పోలీసులు ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఏ ఎయిర్ పోర్టులో భగీరథ్ కనిపించిన తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు మెన్షన్ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు.
