ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ వివరణ

ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ వివరణ

ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. 

మహిళా కమిషన్ కు వచ్చిన బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కమిషన్ ఆఫీసు ఎదుట నిరసనకు దిగింది. ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై స్పందించిన బండి సంజయ్... తప్పు చేసిన వారిని  అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కేసును సుమోటోగా తీసుకున్న  రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 13న  హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే  పార్లమెంటు సమావేశాల కారణంగా 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు