నిరా శ్రయులైన కరీంనగర్ వాసులకు బండి సంజయ్ సాయం

నిరా శ్రయులైన కరీంనగర్ వాసులకు బండి సంజయ్ సాయం

కరీంనగర్, వెలుగు: దైవ దర్శనానికి వెళ్లి నగదు, లగేజీ కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి  కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ కుటుంబం తమిళనాడులోని కాంచీపురం వెళ్లారు. దైవ దర్శనం అనంతరం మంగళవారం రాత్రి ఆలయం సమీపంలో నిద్రిస్తుండగా దొంగలు సామగ్రిని చోరీ చేశారు.

బాధిత కుటుంబంలో ఓ బధిరుడు, ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సామగ్రి చోరీ అయిన విషయాన్ని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ వారిని క్షేమంగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వారికి అక్కడ భోజన వసతి కల్పించడంతో పాటు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రైలు టికెట్స్ బుక్ చేయించారు.