- కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు
కరీంనగర్, వెలుగు: ఈ నెల 13న ‘స్వచ్ఛ పాఠశాల’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిని పరిశుభ్రం చేసే కార్యక్రమానికి తరలిరావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
కరీంనగర్ లో బుధవారం ఆయన మాట్లాడుతూ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ‘స్వచ్ఛ పాఠశాల’లో రాజకీయాలకతీతంగా పాల్గొని సక్సెస్ చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి వెళ్లి అక్కడి స్కూల్‌ను కేంద్ర సహాయ మంత్రి పరిశుభ్రం చేయనున్నారు.
