కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంలో సీఎస్ నెంబర్ వన్

కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంలో సీఎస్ నెంబర్ వన్

గణేష్ నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల పేరుతో ఉత్సవాలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అడ్డుకుంటే.. వినాయకుడి నిమజ్జనం ప్రగతి భవన్ లో చేస్తామన్నారు. శాంతి భద్రతల అంశం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడంలో సీఎస్ సోమేష్ కుమార్ నెంబర్ వన్ అన్నారు. నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ  తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తామన్నారు. లౌడ్ స్పీకర్లపై చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

ఉపాధ్యాయుల దినోత్సవం రోజు కూడా టీచర్స్ ను గౌరవించే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని బండి సంజయ్ అన్నారు. ఇలా చేస్తే విద్యార్థులకు ఏ సందేశం పంపుతారని  బండి సంజయ్ నిలదీశారు. ఇదేనా ఉపాధ్యాయుల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన టీచర్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.