మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో విస్తరిస్తాం..

మియాపూర్ నుంచి సంగారెడ్డి  వరకు మెట్రో విస్తరిస్తాం..

పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఆయనకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.  పైసలిచ్చి మహిపాల్ రెడ్డి పార్టీ టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు.  బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన అన్నారు.  బీజేపీ అధికారంలోకి వస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు విస్తరిస్తామన్నారు.  ప్రధాని మోదీ ఇచ్చిన డబ్బులతోనే తెలంగాణలో ఆస్పత్రులు, డబుల్ బెడ్ రూం ఇళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు.  నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. 

బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  తెలగాణ మరో శ్రీలంకగా మారుతుందన్నారు.  మైనార్టీలను కేసీఆర్ మోసం చేశారని .. వారిని బీఆర్ఎస్ నేతలు కేవలం ఓటు బ్యా్ంక్ గానే చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు.