13 ప్రాంతీయ భాష‌ల్లో సీఏపీఎఫ్ కానిస్టేబుల్ ప‌రీక్ష‌లు... బండి సంజయ్ హర్షం

13 ప్రాంతీయ భాష‌ల్లో సీఏపీఎఫ్ కానిస్టేబుల్ ప‌రీక్ష‌లు... బండి సంజయ్ హర్షం

కేంద్ర భద్రతా దళాల కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలను, తెలుగుతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పందించారు.  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం అని కొనియాడారు.  ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.  

సెంట్రల్ ఆర్మ్ డ్  పోలీస్ ఫోర్సెస్ (CAPF) పరిధిలోని BSF, CRPF, CISF, ITBP, SSB కానిస్టేబుల్ రాత పరీక్షలను హిందీ, ఇంగ్లీష్ తో పాటుగా 13 ప్రాంతీయ భాషలు  అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి బాషల్లో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి  నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.  

ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి ఈ  చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో  తెలిపింది. ఇక ఇదే విషయంపై  తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని పలుమార్లు కోరారు.

https://twitter.com/bandisanjay_bjp/status/1647159317471322115