
రైతులు తమ బాధలు చెప్పుకోకుండా టీఆర్ఎస్ వాళ్లు రాళ్లు వేశారన్నారు బండి సంజయ్. రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. రైతుల మీద దాడి చేసింది టీఆర్ఎస్ నేతలేనన్నారు. ధాన్యం కొనాలని జిల్లాల్లో రైతులు ధర్నా చేస్తున్నారన్నారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. టీఆర్ఎస్ నేతలే కిరాయి గుండాలకు డబ్బులిచ్చి దాడులు చేయిస్తున్నారన్నారు. వానాకాలం పంటపై ఎఫ్‌సీఐతో అగ్రిమెంట్ చేసుకున్నారా? లేదా ప్రభుత్వం చెప్పాలన్నారు. బీజేపీ కార్యకర్తలు టార్గెట్ గా పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడే రైతులపై దాడులు చేస్తున్నారన్నారు బండి సంజయ్. దొంగేదొంగా అన్నట్టుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. ఇది అఫ్ఘానిస్తానా...? పాకిస్తాన్..?అని అన్నారు. వారం రోజులుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తడం లేదన్నారు. తమపై దాడులు చేయాలని డైరెక్ట్ ముఖ్యమంత్రే డైరక్షన్ ఇచ్చారన్నారు. పోలీసులు ఉండగానే తమపై దాడులు చేశారన్నారు.