కేసీఆర్ ప్రకటించింది మొత్తం దండుపాళ్యం ముఠా అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ మేళా - కార్యక్రమంలో బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. - చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ పాపన్న, అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు బండి సంజయ్. ఈ సందర్బంగ మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ లిస్టులో సగం మందికి కేసీఆర్ టికెట్ ఇయ్యరన్నారు. జితేందర్ రెడ్డిది లక్కీ హ్యాండ్ అని.. చేవేళ్లలో బీజేపీ పక్కా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీల పొట్ట కొడుతున్న మూర్ఖుడు కేసీఆర్ అని...దళితబంధు పేరుతో 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ క్యాన్సర్ లాంటోడని.. థర్డ్ స్టేజి దాకా తెచ్చుకోకూడదని సూచించారు. కేటీఆర్ కమిషన్ లు దొబ్బడం తప్పా చేస్తుందేం లేదన్నారు. - బీజేపీ వల్లే తెలంగాణ వచ్చిందని.. కేసీఆర్ పిట్ట కథలకు అందరం ఆగమయ్యారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలు, పోడు భూముల కోసం ఫైట్ చేసింది..యువకుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ కాదని.. బీజేపీ అని అన్నారు.
దళితులంటే కేసీఆర్ కు చిన్నచూపు
ఎస్సీ నియోజకవర్గాల్లో ఓట్లు అడిగేందుకు కేసీఆర్ కి అర్హత లేదన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. - దళితులకే కాదు... ఏ ఒక్క సామాన్యుడికి, పేదవాడికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. - యువరాజుకి, యువరాణికి మాత్రం కోట్ల రూపాయల భూముల్ని అప్పచెప్తుండని ఆరోపించారు. కేసీఆర్ - ప్రజల పొట్టకొడ్తూ... ఆయన ఖజానా నింపుకుంటుండని ధ్వజమెత్తారు.
దళితులపై కెసీఆర్ కు ఇప్పటికీ చున్నచూపేనన్నారు జితేందర్ రెడ్డి. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా.. మూడెకరాల భూమి ఇస్తా .. దళితబందు ఇస్తా ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. - దళితుల దమ్ము ఏంటో చూపించాల్సిన అవసరం వచ్చిందన్నారు