10 శాతం లాభాల వాటా కేటాయించాలి.. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ఎదుట సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ధర్నా

10 శాతం లాభాల వాటా కేటాయించాలి..    శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ఎదుట  సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ధర్నా

నస్పూర్, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 10శాతం లాభాల వాటా కేటాయించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్( ఎస్సీసీడబ్ల్యూయు ఐఎఫ్​టీయూ) ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. యూనియన్​ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం మాట్లాడుతూ గత సంవత్సరం సింగరేణి యాజమాన్యం పర్మినెంట్ కార్మికులకు 34 శాతం లాభాల వాటాను చెల్లించిందని, ఒక్కొక్కరికి రూ.1,96,610 లాభాల వాటా పంచిందన్నారు. పర్మినెంట్ అయినవారితో సమానంగా పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.5,500 ఇవ్వడం సరికాదన్నారు. లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ చాలా ఉందని, వారికి  10 శాతం వాటాను పంచాలని కోరారు.