V6 News

కాంగ్రెస్ నేతల ఇండ్ల ముందు చెత్త వేస్తాం : ఎంపీ బండి సంజయ్

కాంగ్రెస్ నేతల ఇండ్ల ముందు చెత్త వేస్తాం : ఎంపీ బండి సంజయ్
  •     హుజూరాబాద్​లో డంపింగ్​ యార్డు ఏర్పాటును ఉపసంహరించుకోవాలి
  •     ఎంపీ బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: హుజూరాబాద్‌‌లో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పట్టణంలోని చెత్త కుప్పలు, జంతు కళేబరాలను కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు వేస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. అవసరమైతే కాంగ్రెస్ నేతలను రోడ్లపై తిరగనీయబోమని అన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ మండల, పట్టణ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా ఆందోళన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. హుజూరాబాద్‌‌లో డంపింగ్ యార్డు ఏర్పాటైతే ఇక్కడి యువతకు పెళ్లిళ్లు జరగని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్‌‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను ఆశ్రయిస్తామని తెలిపారు. గవర్నర్‌‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.