రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

 రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు  బీజేపీ స్టేట్  చీఫ్ బండి సంజయ్.  రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బండి సంజయ్. లక్ష రూపాయల రైతు రుణమాఫీని వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. వరి  పంట  వేయొద్దని ఇచ్చిన  ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రధాన మంత్రి  ఫసల్  భీమా  పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమవాటా సొమ్ము 413  కోట్ల రూపాయలు  చెల్లించి  రైతులను  ఆదుకోవాలన్నారు.  మొక్కజొన్న  కొనుగోలు  కేంద్రాలు  వెంటనే ప్రారంభించి, రైతులను దళారీల నుండి  రక్షించాలన్నారు సంజయ్. రైతులకు పట్టాదార్  పాసు బుక్కులను వెంటనే  మంజూరు  చేయాలని, ఉచిత యూరియా హామీని అమలు చేయాలన్నారు.

see more news

తల్లికి థియేటర్ ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరో

కాంగ్రెస్ పార్టీనా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా?