రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది

రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది

రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా  ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఏం జరిగినా కేంద్రమే చెప్పిందంటున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. వైద్య సిబ్బంది రక్షణ చర్యల్లో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కరోనా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు వసతి కల్పించడం లేదన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు ఎన్-95 మాస్కులు లేవన్నారు. కరోనా హెల్త్ బులిటెన్ కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. టెస్టులు చేయకుండానే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. టెస్టులు పెరిగితే కేసులు చాలా పెరుగుతున్నాయన్నారు. కరోనా వచ్చినా డ్యూటీ చేయాలని పీజీ డాక్టర్లను బెదిరిస్తున్నారన్నారు. పీజీ మెడికల్ స్టూడెంట్స్ కు టెస్టులు ఎందుకు చేయడం లేదన్నారు. గాంధీ, ఉస్మానియాలో స్టాఫ్ లేరన్నారు బండి సంజయ్.

see more news

సభలో కన్నీరు పెట్టుకున్నస్పీకర్ పోచారం

భారత్ లో 2,56,611 కరోనా కేసులు..7135 మరణాలు

పర్సనల్‌‌ వెహికల్స్‌‌కు దేశమంతా ఒకే రోడ్‌‌ ట్యాక్స్‌‌!