పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా.. ఫస్ట్ టైమ్ సిరీస్ కైవసం

పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా.. ఫస్ట్ టైమ్ సిరీస్ కైవసం

రావల్పిండి: పాకిస్తాన్ గడ్డపై బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌మరో రికార్డు సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో  క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. మంగళవారం ముగిసిన రెండో, చివరి టెస్టులో బంగ్లా 6 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ ఇచ్చిన 185 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను ఆరు వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.  ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 42/0తో ఆట కొనసాగించిన బంగ్లాను జాకీర్ హసన్ (40), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (34), షాడ్మన్ ఇస్లాం (24), ముష్ఫికర్ రహీం (22 నాటౌట్‌) ముందుకు తీసుకెళ్లారు. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (21నాటౌట్‌‌‌‌) విన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్  కొట్టాడు. లిటన్ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌, మొహిదీ హసన్ మిరాజ్‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డులు దక్కాయి.  పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డపై బంగ్లా ఓ టెస్టు మ్యాచ్‌, సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి.