
ఆసియా కప్ 2025 లో బంగ్లాదేశ్ డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. బుధవారం (సెప్టెంబర్ 16) ఆఫ్ఘనిస్తాన్ పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిస్తే సూపర్-4 రేస్ లో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రమే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ లో గెలిస్తే సూపర్-4 కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తో పాటు శ్రీలంక కూడా సూపర్ -4 కు అర్హత సాధిస్తుంది. ఈ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ శ్రీలంకపై ఓడిపోయింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్.. ఒమన్ పై విజయం సాధించింది.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI):
సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, రషీద్ ఖాన్(c), నూర్ అహ్మద్, AM ఘజన్‌ఫర్, ఫజల్‌హఖర్ ఫారూ
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):
తాంజిద్ హసన్ తమీమ్, సైఫ్ హసన్, లిట్టన్ దాస్ (కెప్టెన్, వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, నూరుల్ హసన్, జాకర్ అలీ, షమీమ్ హొస్సేన్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్