19న బంజారాల చలో ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర బంజారాల నగారా కార్యక్రమం

19న బంజారాల చలో ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర బంజారాల నగారా కార్యక్రమం

బషీర్​బాగ్​, వెలుగు: బంజారాల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19, 20 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బంజారాల నగారా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బంజారా భారత్, అఖిల భారతీయ బంజారా మహా సేవా సంఘ్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మాట్లాడారు. బంజారాలకు జరిగిన అన్యాయంపై ఈ నెల 19న చర్చ, 20న బంజారాల అభివృద్ధికి కృషి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఫొటోలకు పాలాభిషేకం చేస్తామని అన్నారు. మహారాష్ట్రలో బంజారాల అస్తులను కాపాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. ఈ సమావేశంలో బంజారా నాయకులు అశోక్ రాథోడ్ వాలునాయక్, మోహన్​నాయక్ నాగవాణి, సోని పాల్గొన్నారు.