బంజారాహిల్స్లో ఫ్రీ హెల్త్ క్యాంప్..భారీ రక్తదాన శిబిరం

బంజారాహిల్స్లో ఫ్రీ హెల్త్ క్యాంప్..భారీ రక్తదాన శిబిరం

హైదరాబాద్ సిటీ,వెలుగు: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇన్​కమ్ టాక్స్​, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం బంజా రాహిల్స్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ టాక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లో హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని  నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని,ఆస్టర్ డీఎమ్ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ సీఈఓ కె. హరి కుమార్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించగా, 60 మంది రక్తదానం చేశారు.హెల్త్​క్యాంప్​లో - వివిధ సమస్యలపై వచ్చిన 180 మంది పరీక్షలు చేయించుకున్నారు.