కోనరావుపేట, వెలుగు: బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో కల్యాణలక్ష్మి చెక్కు వ్యాలిడిటీ ముగిసింది. వివరాలిలా ఉన్నాయి.. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన నేరెళ్ల పద్మకు జనవరి 20న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కల్యాణ లక్ష్మి చెక్కు అందజేశారు. జనవరి 21న మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో డిపాజిట్ చేశారు.
చెక్కు వ్యాలిడిటీ జనవరి 29న ముగియడంతో బ్యాంక్ అధికారులు 30న లబ్ధిదారుకు ఫోన్ చేసి చెక్కు వ్యాలిడిటీ ముగిసిందని బ్యాంకుకు వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. చెక్కును సకాలంలో బ్యాంకులో డిపాజిట్ చేసినా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతోనే డబ్బులు జమ కాలేదని వాపోయింది. తహసీల్ ఆఫీస్‌లో సంప్రదించగా..గడువులోపే మొత్తం 106 చెక్కులు పంపిణీ చేశామని, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పిదం జరిగిందన్నారు.
