బంకీపూర్ ఫలితం రాజకీయాల్లో మార్పునకు సంకేతం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బంకీపూర్ ఫలితం రాజకీయాల్లో మార్పునకు సంకేతం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • దేశ రాజకీయాల్లో కీలక పరిణామం: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు:  బీహార్‌‌లోని బంకీపూర్‌‌ ఉప ఎన్నిక ఫలితం దేశ రాజకీయాల్లో కీలక మార్పునకు సంకేతమని పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఆ పార్టీ ఓడిపోవడం ప్రజాభిప్రాయంలో వస్తున్న మార్పునకు నిదర్శనమన్నారు. బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బంకీపూర్‌‌‌‌ సెగ్మెంట్‌‌లో ఆ పార్టీ ఓడిపోయిందంటే.. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్నారనే సంకేతమని వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌‌లోని దతియా ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌ విజయం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ కూడా బంకీపూర్‌‌ ఫలితాన్ని దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా అభివర్ణించారు. నితిన్‌‌ నబీన్‌‌ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం ప్రజల్లో వస్తున్న రాజకీయ మార్పునకు నిదర్శనమన్నారు. ప్రశాంత్‌‌ కిషోర్‌‌ విజయం బీజేపీ అహంకారానికి గట్టి సమాధానమని పేర్కొన్నారు.