Magallu Zindhabadh Teaser: మగాళ్లకూ సమస్యలుంటాయ్ బాస్.. ‘మగాళ్లు జిందాబాద్’ టీజర్ అదిరిందిగా

Magallu Zindhabadh Teaser: మగాళ్లకూ సమస్యలుంటాయ్ బాస్..  ‘మగాళ్లు జిందాబాద్’ టీజర్ అదిరిందిగా

టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘మగాళ్లు జిందాబాద్’ (Magallu Zindabadh). టైటిల్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఈ సినిమా.. ఇప్పుడు టైటిల్ టీజర్‌తో మరింత ఆసక్తిని పెంచుతోంది. యంగ్ హీరో శ్రీనందు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నారా ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్‌లో కామెడీ, సోషల్ సెటైర్‌తో పాటు హీరో క్యారెక్టర్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. ముఖ్యంగా టైటిల్‌కు తగ్గట్టుగా మగాళ్ల సమస్యలను వినోదాత్మకంగా చూపించేలా టీజర్‌ను కట్ చేయడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. మరి ఈ టైటిల్ టీజర్‌లో ఏముంది? శ్రీనందు ఎలాంటి కొత్త అవతార్‌లో కనిపించాడు? చూద్దాం..

టీజర్‌ను పరిశీలిస్తే.. ‘మగాళ్లు జిందాబాద్’ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే పురుషుల జీవితాల్లో ఎదురయ్యే కొన్ని సమస్యలను కామెడీగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సమాజంలో మగాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి ఎమోషన్స్, కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులను కామెడీ టచ్‌తో తెరకెక్కించినట్లు టీజర్‌లోని సీన్స్ చూస్తే అర్థమవుతోంది.

ముఖ్యంగా శ్రీనందు పాత్రను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కనిపించిన పాత్రలకు భిన్నంగా ఆయన ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు టీజర్‌తో క్లారిటీ వచ్చింది. ఇక వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ కామెడీ టైమింగ్‌తో టీజర్‌లో సందడి చేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ సినిమాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా కేవలం కామెడీ కోసమే కాకుండా ఒక సోషల్ పాయింట్‌ను కూడా టచ్ చేస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. మహిళలను తక్కువ చేసి చూపించడం తమ ఉద్దేశం కాదని, పురుషులు ఎదుర్కొనే కొన్ని సమస్యలను కూడా ప్రేక్షకులకు వినోదాత్మకంగా చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని మేకర్స్ వెల్లడించారు. సీరియస్ అంశాలను కూడా నవ్వించే విధంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

►ALSO READ | Movie Review: కూతుళ్ల పెంపకంపై ప్రేయసి రావే డైరెక్టర్ మూవీ.. ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ ఎలా ఉందంటే?

గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనందుకు జోడీగా లక్ష్మీ దుర్గ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇతర నటీనటులు కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

మొత్తంగా ‘మగాళ్లు జిందాబాద్’ టైటిల్ టీజర్ చూస్తే కామెడీతో పాటు సోషల్ సెటైర్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి టీజర్‌లో కనిపించిన ఈ కామెడీ, సెటైర్‌ను దర్శకుడు నారా ప్రవీణ్ పూర్తి సినిమాలో ఎలా నడిపించారు? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో సినిమా విడుదల తర్వాత చూడాలి.