
కరీంనగర్ జిల్లాలోని శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం (మే 13) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లు షురూ అవుతాయని తెలిపింది.
శాతవాహన వర్శిటీలో లా కాలేజ్ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి శాతవాహన వర్శిటీలో లా కాలేజీకి అనుమతి ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. తన విజ్ఞప్తి మేరకు అనుమతి లభించినట్లు ఆయన వెల్లడించారు.